![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -149 లో.....శైలుతో కేశవ చాటింగ్ చేస్తుంటే.. మహా, చక్రి వస్తారు. అమ్మాయి ఫోన్ లో మాట్లాడినప్పుడు మాటలు విన్నాను చాలా మంచిది వదులుకోకని కేశవతో మహా చెప్తుంది. ఒకసారి ఫోన్ ఇవ్వరా ఏం చాటింగ్ చేసావోనని చక్రి అనగానే ఇవ్వండి అని మహా కూడా ఇవ్వమని అడుగుతుంది. కేశవ ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్తాడు. మహా నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఆఫీస్ లో విక్కీ అందరిని పిలిచి మన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాం.. ప్రాజెక్ట్స్ కోసం పాతకాలం ఇల్లు కావాలి.. ఎవరికి అయినా తెలిస్తే చెప్పండి అని విక్కీ అంటాడు. అందరు నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉందని మహా చెప్తుంది. సరే రేపు ఒకసారి వెళదామని విక్కీ అంటాడు.
ఆ తర్వాత శైలు తన ఫ్రెండ్ కీర్తికి ఫోన్ చేసి నేను కేశవతో బయటకు వెళ్తున్నాను.. మా అమ్మ అడిగితే నేను నీతో ఉన్నానని చెప్పని చెప్తుంది. ఆ తర్వాత శైలు కాలేజీకి వెళ్తుంటే వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూతురికి పెళ్లి సంబంధం వచ్చిందని తన భార్యకి చెప్తాడు. మీరు ఎప్పుడు నీ కూతురికి చేస్తారు.. ఇప్పుడు ఎవరిని నమ్మలేం.. ప్రేమ అంటూ తిరుగుతున్నారని శైలు అమ్మ వరాలు అంటుంది. నా కూతురు అలా ఏం కాదని అతను అంటాడు. మరొకవైపు కేశవ అందంగా ముస్తాబవుతుంటే కన్నా, మాధవ ఆటపట్టిస్తారు. మరొకవైపు మహా విక్కీ దివ్య మాట్లాడుకుంటుంటే మహాకి హారిక ఫోన్ చేసి కలుద్దామని అంటుంది. దాంతో విక్కీ పర్మిషన్ తీసుకొని మహా వెళ్తుంది. ఆ తర్వాత హారికని మహా కలుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉంటావని అడుగుతుంది. అందరు ఆ ఇంటికి శాపం ఉందనుకుంటున్నారు. అందుకే ఉండాల్సి వస్తుంది. పెద్దికి పెళ్లి చేస్తే ఒక అమ్మాయి ఇంట్లో ఉంటుంది. నేను బయటకు వచ్చేస్తానని మహా చెప్తుంది. అందరు నిన్ను చక్రి భార్య అని ఫిక్స్ కాకముందే ఇంట్లో నుంచి వచ్చేయ్ విడాకులు తీసుకోమని హారిక సలహా ఇస్తుంది. ఆ తర్వాత మహా నడుచుకుంటూ వస్తుంటే.. చక్రి వస్తాడు. అలా కేఫ్ లో కూర్చొని మాట్లాడుకుందామని మహా అనగానే చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు కేశవ, శైలు కలుసుకుంటారు. ఇద్దరు బైక్ పై వెళ్తారు. కేశవని శైలు హగ్ చేసుకొని కూర్చొని వెళ్తుంది. అలా వెళ్లడం శైలు వాళ్ళ నాన్న చూస్తాడు.
ఆ అమ్మాయి ఎవరో కానీ చూడు ఎలా వెళ్తుందో వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఎంత బాధపడుతారని శైలు వాళ్ళ నాన్నతో పక్కనున్న అతను అంటాడు. దాంతో అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మనం విడాకులు తీసుకుందాం.. రేపు లాయర్ దగ్గరికి వెళ్లి మ్యూచువల్ డైవర్స్ అప్లై చేద్దాం సంతకం పెట్టండి అని మహా అనగానే చక్రి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో విక్కీ, దివ్య కలిసి వింటేజ్ హౌస్ అయిన నారాయణ ఇల్లు చూడడానికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |